ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు భారీ ఊరట
న్యూఢిల్లీ, 10 మార్చి (హి.స.) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు భారీ ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీ
Phone tapping


న్యూఢిల్లీ, 10 మార్చి (హి.స.)

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు భారీ ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచనలు చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని ప్రభాకర్ రావును హెచ్చరించింది. అంతేకాదు.. కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం, దేశం దాటడానికి వీళ్లేదని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను టార్గెట్గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈకేసులో నిందితులైన పలువురు పోలీసు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో ప్రభాకర్రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ తిరుపతన్న వంటి వారు ఉన్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహారించిన ప్రభాకర్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా పలు సంచలన ఆరోపణలు ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande