
గురజాల, 10 మార్చి (హి.స.)
: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యల కేసులో నిందితుడు, వైకాపా నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్ను గురజాల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వెంకట్రామిరెడ్డి ఏ-7గా ఉన్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.
గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావును గతేడాది కొందరు హత్య చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని హుజూర్నగర్ జిల్లాలో ఒక వివాహానికి హాజరై బైక్పై తిరిగి వెళ్తుండగా.. వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద వారిని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ హత్య వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉన్నట్లు అనుమానం ఉండటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ