
హైదరాబాద్, 10 మార్చి (హి.స.)
తెలంగాణకు కొత్త గవర్నర్గా
(Telangana New Governor) ఇటీవల నియమితులైన శివప్రతాప్ శుక్లా (Siva Pratap Shukla) తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కే.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు గవర్నర్ ను స్వాగతించిన సీఎం అక్కడే మర్యదపూర్వకంగా గవర్నతో భేటీ అయ్యారు. రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు లోక్ భవన్ లో అధికారులు చేస్తున్నారు. ఇటీవల పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసింది. తెలంగాణలో పని చేసిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు