
కడప, 11 మార్చి (హి.స.) ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ రైల్వన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా అనేక రకాల సేవలు సులభతరం చేసింది. అన్ని రకాల సేవలను రైల్వన్ యాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించింది. సదరు యాప్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఈ విషయమై కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి నుంచి పలు రకాల సేవలను రైల్వన్ యాప్ కిందికి రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.
గతంలో అన్రిజర్వ్డ్ టికెట్ ఇష్యూయింగ్ సిస్టం్బయూటీఎస్శ్ ద్వారా జనరల్, సీజన్, ప్లాట్ఫాం టికెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు రైల్ వన్ యాప్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు. వెయిటింగ్ లిస్టులో ఉన్న ఎన్ఆర్ స్థితిని తెలుసుకోచ్చు. టికెట్లను రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ