అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు.. ఆసిఫాబాద్ కలెక్టర్
ఆసిఫాబాద్, 11 మార్చి (హి.స.) అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్. డీఎస్పీ వహీదుద్దీన్ లతో కలిసి జిల్లా
కలెక్టర్


ఆసిఫాబాద్, 11 మార్చి (హి.స.)

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్. డీఎస్పీ వహీదుద్దీన్ లతో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం, పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2025 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 31 కేసులు నమోదు కాగా.. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఆసిఫాబాద్ పరిధిలో మూడు కేసులు, కాగజ్నగర్ పరిధిలో మూడు కేసులు నమోదు అయ్యాయని, త్వరితగతిన విచారణ చేసి నిందితులకు చట్టపరమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అట్రాసిటీ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. సదరం శిబిరం జరుగుతున్న తీరు, కల్పించిన సౌకర్యాల పై అధికారులను ఆరా తీశారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande