
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనం తప్ప ఏమీ లేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చడం ఎందుకు?.. మళ్లీ కట్టిస్తామనడం ఎందుకు? అని ప్రశ్నించారు.
గతంలో తమ ప్రభుత్వంలో హైదరాబాద్లో లక్ష మందికి ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా కూల్చిన ఇళ్లు మళ్లీ నిర్మించే వరకు పోరాడతాం. మీకు నచ్చిన వారికి ఇళ్లు ఇస్తారు.. నచ్చని వాళ్లకు ఇవ్వరా? మీరు సర్కార్ నడుపుతున్నరా.. సర్కస్ నడుపుతున్నారా? దీనిపై కచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్