పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు.. కామారెడ్డి జిల్లా ఎస్పీ
కామారెడ్డి, 11 మార్చి (హి.స.) పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు అందించడానికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన స
Sp


కామారెడ్డి, 11 మార్చి (హి.స.)

పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు

అందించడానికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సెక్షన్ ఇన్చార్జిల ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మెరుగుపరచడం, పర్యవేక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన సెక్షన్ ఇన్చార్జిలతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి, స్టేషన్లలో పిటిషన్ మేనేజ్మెంట్ సకాలంలో జరుగుతుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి పక్షపాతం లేకుండా పని విభజన జరగాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతాయుతంగా ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పౌరుడికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిలో ఏకరూప నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. వ్యవహరించాలని సెక్షన్

-సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే బాధితులకు సమయానికి న్యాయం అందడం అత్యంత ముఖ్యమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని, తక్షణ పరిష్కారం అందించేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత పాటించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజలకు గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సీనియర్ సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు సరైన మార్గదర్శకత్వం అందించి వారిని ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతిరోజు విధులకు హాజరయ్యే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను సరైన ప్రణాళికతో సిద్ధం చేసుకుంటే పని ఒత్తిడి తగ్గి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, పీసీఆర్ సీఐ నరేష్, జిల్లాలోని వివిధ సెక్షన్ ఇన్చార్జిలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande