ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు బిగ్ రిలీఫ్
హైదరాబాద్, 11 మార్చి (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో
ఎమ్మెల్యేల అనర్హత


హైదరాబాద్, 11 మార్చి (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి.. తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. తాజాగా మరో ఇద్దరికీ క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత(MLA's Disqualification) అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, కాలెయాదయ్య, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణీత గడువులోగా స్పీకర్ విచారణ చేసి తుది నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande