
కరీంనగర్, 11 మార్చి (హి.స.)
కరీంనగర్ డంపింగ్ యార్డు శాశ్వతంగా
తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని డంపింగ్ యార్డు ద్వారా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారింది అన్నారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అని ఆయన సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కరీంనగర్ నుండి తరలించిన డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ మేనేజ్మెంట్ విషయంలో ఇబ్బందులు లేకుండా రెండు నగరాల మధ్య ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీలో వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకోలేకపోయారు అన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన డంపింగ్ యార్డ్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులను అధికారుల బాధ్యత తీసుకున్నాం అని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజల శ్వాసకోస ఇబ్బందులతో పాటు, అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదని సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తాం అని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రి హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపుకు తీసుకుంటాం అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు