
హైదరాబాద్, 11 మార్చి (హి.స.) కూకట్పల్లిలో స్పా ముసుగులో
వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు, సైబరాబాద్ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దివ్య అనే మహిళ భాగ్యనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని 'చాంప్ స్పా సెంటర్' పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో కస్టమర్లను బుకింగ్ చేసుకుని స్పా సెంటర్లో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాడిలో పది మంది యువతులు పట్టుబడగా. దివ్యతో పాటు సంగీత, ప్రకాశ్ అనే ఇద్దరు వ్యభిచార గృహం నిర్వహించేందుకు మద్దతు ఇస్తున్నట్టు గుర్తించి వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ కె.వి. సుబ్బారావు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు