యుద్ధం పేరుతో కాంగ్రెస్ నన్ను దూషిస్తోంది.. ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్
కొచ్చి, కేరళ, 11 మార్చి (హి.స.) పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతోన్న యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ (Congress) తనను దూషిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ కేరళ (Kerala)లోని కొచ్చిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమా
మోడీ


కొచ్చి, కేరళ, 11 మార్చి (హి.స.)

పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతోన్న

యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ (Congress) తనను దూషిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ కేరళ (Kerala)లోని కొచ్చిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అక్కడ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బాధితులకు సహాయం అందించేందుకు ఎంబసీలు నిరంతరం పని చేస్తున్నాయని, వారికి ఆహారం, వసతి కల్పించడంలో వెనకాడబోమని హామీ ఇచ్చారు. అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత కోసం సహకరిస్తున్న గల్ఫ్ (Gulf) దేశాధినేతలకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సింది పోయి, ప్రతిపక్షాలు ఈ సంక్షోభాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఆపదలో చిక్కుకోవాలని, తద్వారా మోదీని విమర్శించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. యుద్ధంలో భారతీయులు చిక్కుకోవాలని కాంగ్రెస్ ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ యువరాజు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, దేశ యువతపై ఆయనకు అవగాహన లేదన్నారు.

కేరళ పేరు మార్పుపై హర్షం..

కేరళ రాష్ట్రాన్ని ఇకపై అధికారికంగా 'కేరళం'గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మలయాళీలకు ఆయన అభినందనలు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం దాదాపు 4,500 శాటిలైట్ ట్రాన్స్పాండర్లను అమర్చినట్లు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande