స్వయంగా గాంధీ మనవడే గాంధీ విగ్రహం అవసరం లేదని చెబుతున్న రేవంత్ రెడ్డి వినడం లేదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, 11 మార్చి (హి.స.) మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మూసీ పేరుతో రేవంత్ సర్కార్ భారీ కుంభకోణానిక
ప్రవీణ్ కుమార్


హైదరాబాద్, 11 మార్చి (హి.స.)

మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మూసీ పేరుతో రేవంత్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. ఖమ్మంలోని వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజేంద్రనగర్ మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ.. మళ్లీ సిగ్గులేకుండా రాత్రికిరాత్రికి పేరు మీద పెయింట్ వేసి మాకు సంబంధం లేదని మంత్రి పొంగులేటి చెబుతుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మళ్లీ వెలుగుమట్ల పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande