హెల్మెట్ ఉంటేనే కలెక్టరేట్లోకి ఎంట్రీ..! మానుకోట పోలీసులు
మహబూబాబాద్, 11 మార్చి (హి.స.) రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్
Police


మహబూబాబాద్, 11 మార్చి (హి.స.)

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు.

అవగాహన హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై కల్పించారు. భద్రత కోసం హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు. కొంతమంది వాహనదారులు వెంటనే హెల్మెట్ తెచ్చుకుని ధరించిన తర్వాతనే కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా కార్లలో సీటు బెల్ట్ ధరించకుండా వచ్చిన డ్రైవర్లపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తమ ప్రాణ భద్రత కోసం ఎంతో అవసరమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాల వల్లే ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతుందని, హెల్మెట్ వినియోగం వల్ల ప్రమాదాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. కలెక్టరేట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో భద్రతా దృష్ట్యా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు అరైవ్ ఆలైవ్” నినాదాన్ని గుర్తుంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande