చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్థిక విధ్వంసం : గణాంకాలతో విరుచుకుపడిన జగన్
అమరావతి, 11 మార్చి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడ
జగన్


అమరావతి, 11 మార్చి (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదాయం తగ్గి, అప్పులు అమాంతం పెరిగాయని, దీనికి కాగ్ (CAG) నివేదికే సాక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని జగన్ లెక్కలతో సహా వివరించారు. వైసీపీ హయాంలో 2023-24లో రాబడులు రూ. 1,70,767 కోట్లు ఉండగా, చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది అది రూ.1,68,024 కోట్లకు పడిపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు 56 శాతం, ద్రవ్య లోటు 30 శాతం పెరిగిందని పేర్కొన్నారు. రెవిన్యూ లోటు ఏకంగా రూ. 60,285 కోట్లకు చేరిందన్నారు. చంద్రబాబు రెండేళ్లలోనే రూ.3.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పు రూ.3.31 లక్షలతో పోలిస్తే, వీరు కేవలం రెండేళ్లలోనే దాదాపు అంతే అప్పు చేశారని మండిపడ్డారు.

ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పే అప్పుల లెక్కలకు, కాగ్ రిపోర్టుకు మధ్య రూ. 20 వేల కోట్ల వ్యత్యాసం ఉందని జగన్ ఆరోపించారు. బడ్జెట్ అప్పులు రూ. 60,485 కోట్లు అని ప్రభుత్వం చెబితే, కాగ్ మాత్రం రూ. 81,071 కోట్లు అని తేల్చిందని, వాస్తవాలను దాచిపెడుతున్నారని విమర్శించారు. బడ్జెట్ వెలుపల చేసిన అప్పుల వివరాలను అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. సభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande