ప్రత్తిపాడు మండలం లోని దారపల్లి గ్రామ శివాలయం సమీపంలో పులి సంచారం
ప్రత్తిపాడు, 12 మార్చి (హి.స.): మండలంలోని దారపల్లి గ్రామ శివాలయం సమీపంలో అర్ధరాత్రి పులి సంచారం కలకలం రేపింది. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దారపల్లి, తాడువాయి గ్రామాల మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అధికారులు ధ్రువీ
ప్రత్తిపాడు మండలం లోని దారపల్లి గ్రామ శివాలయం సమీపంలో పులి సంచారం


ప్రత్తిపాడు, 12 మార్చి (హి.స.): మండలంలోని దారపల్లి గ్రామ శివాలయం సమీపంలో అర్ధరాత్రి పులి సంచారం కలకలం రేపింది. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దారపల్లి, తాడువాయి గ్రామాల మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. శంఖవరం, ప్రత్తిపాడు మండలాల సరిహద్దు కొండ ప్రాంతంలోనూ పులి గాండ్రింపులను గుర్తించారు. రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి కదలికలపై అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande