రైతు భరోసాను రూ.12 వేలకే పరిమితం చేశారు: రామచందర్ రావు
సీఎం రేవంత్రెడ్డికి భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ రాశారు
Ramachandra rao


హైదరాబాద్, 12 మార్చి (హి.స.)సీఎం రేవంత్రెడ్డికి భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ రాశారు. రైతు భరోసాను ఏడాదికి ఎకరాకు రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని.. కానీ రూ.12 వేలకే పరిమితం చేశారని అందులో పేర్కొన్నారు. దాన్ని కూడా సమయానికి ఇవ్వడం లేదని చెప్పారు. యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.

‘‘ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పంటలు ఎండిపోతున్నాయి. అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో కుక్కలు, కోతులు, పందుల బెడద నెలకొంది. మురుగు వ్యవస్థ సరిగా లేక అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడే బాధ్యతను విస్మరించారు. తెలంగాణ ప్రజల గొంతుకగా భాజపా.. ఈ సమస్యలను మీ దృష్టికి తెస్తోంది’’ అని రామచందర్ రావు లేఖలో తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande