
జమ్మూ కాశ్మీర్, 12 మార్చి (హి.స.) జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయనపై ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేందుకు ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ గురితప్పడంతో ఫరూఖ్ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఆ భగవంతుడే తనను రక్షించాడని (God Saved Me) .
అన్నాడు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. వివాహ వేదిక నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది తనను కారులో ఎక్కించి అక్కడినుంచి పంపించేశారని చెప్పారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంవల్లే తాను ఈ ఘటన నుంచి బయటపడగలిగానని అన్నారు. దాడి వెనక ఉద్దేశం ఏమిటనేది నాకు తెలియదని చెప్పారు.
ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశాడని, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారని అన్నారు. ఇక ఫరూక్పై జరిగిన హత్యాయత్నాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల విషయంపై జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..