దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన వందలాది పూరిళ్లు
న్యూఢిల్లీ, 12 మార్చి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఉత్తమ్ నగర్ (Uttam Nagar) సమీపంలో గల మటియాలా చేపల మార్కెట్లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్కెట్లోని పలు దుకాణాలు, సమీపంలోని గుడిసెల
ఫైర్ యాక్సిడెంట్


న్యూఢిల్లీ, 12 మార్చి (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఉత్తమ్ నగర్ (Uttam Nagar) సమీపంలో గల మటియాలా చేపల మార్కెట్లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్కెట్లోని పలు దుకాణాలు, సమీపంలోని గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 12.30 ప్రాంతంలో ఫిష్ మార్కెట్లో మంటలు చెలరేగినట్లుగా సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు 23 ఫైరింజన్లను ఘటనా స్థలానికి తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా మంటలు అంటుకున్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.

ఘటనా స్థలంలో ఉద్రిక్తత..

ఇటీవలే హోలీ వేడుకల సమయంలో ఓ యువకుడి హత్యతో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్ది దూరంలోనే ఈ అగ్నిప్రమాదం సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియా (Social Media)లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande