గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
LPG crisis


హైదరాబాద్, 12 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇండేన్( INDANE) గ్యాస్ ఐవీఆర్ఎస్(IVRS), వాట్సాప్ (WhatsApp)లు బుకింగ్ పని చేయడం లేదు. అప్పుడప్పుడు భారత్, HP గ్యాస్ ఐవీఆర్ఎస్(IVRS), వాట్సాప్ (WhatsApp) బుకింగ్లు పని చేయట్లేదు.

దీనితో గ్యాస్ డీలర్లు వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. ఏపీలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాక్ లాగ్ తగ్గించుకునేందుకు ఆయిల్ కంపెనీలు ఇలా చేస్తున్నాయని వినియోగదారులు తెలిపారు. వినియోగదారుల మొబైల్కు ఓటీపీ (OTP) వస్తేనే డెలివరీ ఇవ్వాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై ఆయా కంపెనీలు ఆంక్షలు విధించాయి. గ్యాస్ దుర్వినియోగం గాకుండా వినియోగదారుల మొబైల్ నుంచి ఓటీపీ (OTP) తీసుకుంటున్నామని ఆయిల్ కంపెనీల అధికారులు చెబుతున్నారు.

రోజు వారి బుకింగ్ల కంటే నిన్న(బుధవారం) ఒక్కరోజే మూడు రెట్లు అధికంగా బుకింగ్లు జరిగాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. గృహ అవసరాలకు ఎలాంటి గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ప్యానిక్ బుకింగ్తోనే ఈ సమస్య వస్తోందని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే కమర్షియల్ సిలెండర్ల సరఫరాను సగానికి పైగా ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. హాస్టల్స్, ఆస్పత్రుల వంటి అత్యవసర సర్వీసులకే ఇవ్వాలని ఆయిల్ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande