
హైదరాబాద్, 12 మార్చి (హి.స.)నెట్ఫ్లిక్స్తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఫోర్త్సిటీని నిర్మిస్తున్నామని.. నెట్ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్రెడ్డి ఈరోజు (గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డి. శ్రీధర్బాబు, సినీనటుడు రానా దగ్గుబాటి, నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈఓ శ్రీ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్