
ముంబై, 12 మార్చి (హి.స.)
పశ్చిమాసియా (West Asia)లో
భారత ఉద్రిక్తతల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇవాళ ఫారెక్స్ మార్కెట్ (Forex Market) ప్రారంభం నుండే ఒత్తిడికి లోనైన రూపాయి, అమెరికన్ డాలర్తో పోలిస్తే ఏకంగా రూ.92.35 వద్దకు చేరుకుని రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది.
చమురు సంక్షోభం సెగ..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభం (Oil Crisis) రూపాయి పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, భారత్ తన దిగుమతుల కోసం భారీగా డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ భారీగా క్షీణించింది. చమురుతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్రాలు, ఇతర దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడటంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ తాజా పరిణామం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..