కేసీఆర్, హరీశ్రావును ఇబ్బంది పెట్టడానికే పీసీ ఘోష్ కమిషన్’
కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది
Court


హైదరాబాద్, 12 మార్చి (హి.స.)కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు వేశారు. కేసీఆర్, హరీశ్రావు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటికే ప్రభుత్వం, కమిషన్ తరఫు వాదనలు పూర్తయ్యాయి.

కేసీఆర్, హరీశ్రావును ఇబ్బంది పెట్టడానికే కమిషన్ వేశారని న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా వీరిద్దరినీ లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరిపైనా ఇప్పటికే దుష్ప్రచారం చేశారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande