ఫుడ్ డెలివరీ సంస్థలపై LPG ఎఫెక్ట్.. ఏకంగా 5 శాతం షేర్లు పతనం
ముంబై, 12 మార్చి (హి.స.) దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ దెబ్బతో ఫుడ్ డెలివరీ దిగ్గజాలైన జోమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) షేర్లు ఇవాళ ట్రేడింగ్లో భారీ నష్టాలను చవిచూశాయి. గ్యాస్
ఎల్పిజి


ముంబై, 12 మార్చి (హి.స.)

దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ దెబ్బతో ఫుడ్ డెలివరీ దిగ్గజాలైన జోమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) షేర్లు ఇవాళ ట్రేడింగ్లో భారీ నష్టాలను చవిచూశాయి. గ్యాస్ కొరత వల్ల రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్కెట్ ఫస్ట్ సెషన్లో జోమాటో పెరెంట్ కంపెనీ ఎటర్నల్ (Eternal) షేరు, స్విగ్గీ షేర్లు 5 శాతం మేర క్షీణించాయి. వాణిజ్య గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను ఆయా తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచప్రాయంగావెల్లడించాయి. అయితే, ఈ పరిణామం నేరుగా ఫుడ్ డెలివరీ యాప్స్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన రవాణా నిలిచిపోయింది. దీంతో దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యావశ్యక వస్తువుల చట్టం కింద ఎల్పీజీ, సీఎనీ (CNG) సరఫరాకు ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు ఇలానే కొనసాగితే.. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉంది బిజిసెన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande