ఇది అర్బన్ నక్సల్స్ రిపోర్ట్.. విద్యా కమిషన్ సిఫార్సులపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, 12 మార్చి (హి.స.) తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సిఫారసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. ''గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః..'' అంటూ గురువులకు గౌరవం ఇవ్వాలని మన సంస్కృతి మనకు నేర్పుతుంటే త
బండి సంజయ్


హైదరాబాద్, 12 మార్చి (హి.స.)

తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సిఫారసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. 'గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః..' అంటూ గురువులకు గౌరవం ఇవ్వాలని మన సంస్కృతి మనకు నేర్పుతుంటే తెలంగాణ విద్యా

కమిషన్ మాత్రం తెలంగాణ ఉపాధ్యాయ సమాజాన్ని అవమానించే సిఫార్సులు చేసిందని మండిపడ్డారు. మన సమాజంలో గురువుల పాత్ర, మన నాగరిక విలువలకు గౌరవం తెలియని అర్బన్ నక్సల్స్ తయారు చేసిన నివేదికల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ నివేదికను తిరస్కరించి తెలంగాణ ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని లేదా ఈ సిఫార్సులు సరైనవే అని ప్రభుత్వం భావిస్తే వాటిని అమలు చేసి ఎన్నికలు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఉపాధ్యాయులు తమ తీర్పు ఏమిటో చెబుతారన్నారు. గురువులను గౌరవించుకోవాల్సిన చోట ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలి, పదోన్నతులు (Promotions) నిలిపివేయాలి, ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఇవాళ పోస్టు చేశారు. విద్యాకమిషన్ నివేదికపై విమర్శలు:

కాగా రిటైర్డ్ ఐఏఎఏస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాకమిషన్ తన అధ్యయనం పూర్తి చేసి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఉపాధ్యాయుల జీతభత్యాల క్రమబద్ధీకరణ అంశపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు ఈ కమిషన్ ప్రతిపాదనలపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశాయి. ఈ వివాదం చిలికి చికిలి గాలివానలా మారే సూచనలు కనిపించడంతో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు సైతం విద్యాకమిషన్ రిపోర్టుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల జీతాల విషయంలో వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande