యుద్ధం ఎఫెక్ట్ ప్రచారం.. తమిళనాడులో రాత్రి పెట్రోల్ బంకుల వద్ద టెన్షన్ టెన్షన్!
న్యూఢిల్లీ, 12 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధం కారణంగా దేశంలో చమురు నిల్వలు తగ్గాయన్న ప్రచారంతో దేశంలోని ప్రధాన నగరాల్లో జనంతో పెట్రోల్
War effect


న్యూఢిల్లీ, 12 మార్చి (హి.స.)

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధం కారణంగా దేశంలో చమురు నిల్వలు తగ్గాయన్న ప్రచారంతో దేశంలోని ప్రధాన నగరాల్లో జనంతో పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నైలోని వేలచేరి ప్రాంతంలో బుధవారం రాత్రి అనూహ్య పరిస్థితులు కనిపించాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు క్యూ కట్టారు.

చాలామంది తమ యుద్ధం ప్రభావంతో ముడి చమురు దిగుమతులు నిలిచిపోతాయని, ఫలితంగా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నెల రోజులకు సరిపడా ఇంధనాన్ని ఇప్పుడే నింపుకోవాలనే ఉద్దేశంతో వాహనాలకు 'ఫుల్ ట్యాంక్' చేయించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో ఎల్పీజీ (LPG) కొరత సూచనలు కనిపిస్తుండటం, కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తిని 25% పెంచాలని నిర్ణయించడంతో.. పెట్రోల్ విషయంలోనూ అదే జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నది చూసి.. పెట్రోల్ కూడా దొరకదేమోనన్న భయంతో బంకుల వద్ద టెన్షన్ టెన్షన్ వాతావరణం కన్పిస్తోంది. ఇదిలా ఉండగా

ఇంధన సరఫరాపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ఆంక్షలు వెలువడలేదు. వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande