సంపద సృష్టే లక్ష్యంగా ముందుకు సాగాలి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, 12 మార్చి (హి.స.)రాష్ట్రంలో సంపద సృష్టి, పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా జిల్లా కలెక్టర్లు, యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం సచివాలయంలో రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని, ప
సీఎం చంద్రబాబు


అమరావతి, 12 మార్చి (హి.స.)రాష్ట్రంలో సంపద సృష్టి, పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా జిల్లా కలెక్టర్లు, యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం సచివాలయంలో రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని, పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో మన స్థానం ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని తెలిపారు. మన వద్ద ఉన్న వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే అవి వ్యర్థమవుతాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితిని మార్చి, నమ్మకాన్ని పునరుద్ధరించాలని అధికారులను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande