
తాడేపల్లి, 12 మార్చి (హి.స.)
ఏపీ వ్యాప్తంగా వైసీపీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) 16 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి అయిందని తెలిపారు. దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నల్లకాలువలో ఇచ్చిన ఒక్క మాట కోసం పార్టీ ఆవిర్భావం అయినట్లు వెల్లడించారు. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు వైసీపీ అర్థం చెప్పిందన్నారు. వైసీపీ అనేది ఒక్క జగన్ది కాదు.. కోట్లాది మంది కార్యకర్తలదన్నారు. ఆ రోజు జగన్ అనే వాడు ఒక్కడేనని అన్నారు.
జగన్ ఎప్పుడు భయపడలేదు.. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రలు కుతంత్రాలు చేశారని విమర్శలు గుప్పించారు. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదుని ధీమా వ్యక్తం చేశారు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న వైసీపీ కార్యకర్తల మీదనే నమ్మకం ఉందన్నారు. నేను నమ్ముకున్న దేవుడు, ప్రజలు ఇద్దరు తోడుగా ఉన్నారు.. వైసీపీ ఎప్పటికీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, తనతో పాటు నడిచే కార్యకర్తలు కాలర్ ఎగరేసి అదిగో అతడే మా నాయకుడు, అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ ఎప్పుడు అడుగులు వేస్తోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV