
అనకాపల్లి , 13 మార్చి (హి.స.), అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, పేదలు నివాసం ఉండే ప్రాంతం. స్థానిక కొందరు గంజాయి, మత్తు ఇంజెక్షన్ల విక్రయిస్తూ యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎంతో కాలంగా గుట్టు జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఆపరేషన్ వజ్రప్రహార్తో పోలీసులు రట్టు చేశారు. ఏఎంసీ కాలనీలో గురువారం వేకువజామున అనకాపల్లి డీఎస్పీ శ్రావణి సీఐలు, ఎస్సైలు, ఈగల్ టీం సిబ్బంది 115 మందితో ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. గంజాయి, మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కాలనీలో నివాసం ఉంటున్న నిమ్మకాయల జ్యోతి ఇంట్లో మూడు కేజీల గంజాయి, దొడ్డి తిమోతి ఇంట్లో నాలుగు కేజీలు, మల్లంపర్లి గణేష్ ఇంట్లో 165 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి చెప్పారు. రికార్డుల్లేని 9 బైక్లను సీజ్ చేశామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ