
నిజామాబాద్ , 13 మార్చి (హి.స.): జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బస్సు 22 మందితో నాగ్పుర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన సమీపంలోని టోల్ప్లాజా సిబ్బంది.. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ప్రమాదం చోటుచేసుకుందని.. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ