
అమరావతి, 13 మార్చి (హి.స.)కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదజరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. బళ్లారి సమీపంలో మృతుల కారును కర్ణాటకకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆదోనికి చెందిన అనురాగ్, ఐశ్వర్య దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. అనురాగ్, ఐశ్వర్య దంపతులు కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలియడంతో బళ్లారి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే గొడ్డావుల కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. బొలెరో వాహనం కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. అనంతపురం నుంచి మదనపల్లికి కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ