ఏకీకృత కుటుంబ సర్వే ను అధికారులు టఫీ దశకు తీసుకొచ్చారు
అచ్యుతాపురం, 13 మార్చి (హి.స.), : సంక్షేమ పథకాలు అమలు మరింత సమర్థంగా అమలు చేయడానికి చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేను (యూఎఫ్ఎస్) అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జిల్లాలో తుదిదశకు తీసుకొచ్చారు. అయిదు మండలాల్లో తప్ప అన్నిచోట్లా పదుల సంఖ్యలో మాత్రమే
ఏకీకృత కుటుంబ సర్వే ను అధికారులు టఫీ దశకు తీసుకొచ్చారు


అచ్యుతాపురం, 13 మార్చి (హి.స.), : సంక్షేమ పథకాలు అమలు మరింత సమర్థంగా అమలు చేయడానికి చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేను (యూఎఫ్ఎస్) అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జిల్లాలో తుదిదశకు తీసుకొచ్చారు. అయిదు మండలాల్లో తప్ప అన్నిచోట్లా పదుల సంఖ్యలో మాత్రమే వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ నెలాఖరుకు దీన్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో 24 మండలాలు, రెండు మున్సిపాలిటీలు, ఒక జీవీఎంసీ పరిధిలో 5,86,806 గృహాలు ఉన్నాయి. గత ఏడాది ప్రభుత్వం యూఎఫ్ఎస్ కార్యక్రమాన్ని జిల్లాలో 711 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రారంభించింది. వీటి పరిధిలో ఏకీకృత కుటుంబ సర్వేను సిబ్బంది వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంటింటా తిరిగి సచివాలయ ఉద్యోగులు ప్రజల ఆర్థిక, విద్యార్హత, కులం, వృత్తి, వయస్సు ఇలా అన్ని వివరాలను డిజిటల్ పద్ధతిలో సేకరించారు. కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫాం మీదకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్ఎస్) పేరుతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలతోపాటు ప్రజలకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను క్షణాల్లో జారీచేయడానికి ఉపయోగపడేలా ఈ సర్వేను రూపొందించారు. ప్రభుత్వపరంగా అందించే అన్ని రకాలైన సేవలు, సంక్షేమానికి ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande