
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)
భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా నేడు మరోసారి పంజా విసిరింది.
మల్కాజ్గరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నాగోల్ సర్కిల్.. కుంట్లూర్ డివిజన్ పరిధిలోని పసుమాములలో శుక్రవారం 'హైడ్రా'పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. అబ్దుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలో సర్వే నెం 454లో కళింగరావు అనే వ్యక్తి ప్లాట్లను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో 'శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు హయత్ నగర్ పోలీసులతో కలిసి భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కబ్జాదారుల నుంచి దాదాపు రూ.15 కోట్ల స్థలాన్నికాపాడి బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధితులు 'శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు