రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి
ఖమ్మం, 13 మార్చి (హి.స.) రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగ
మంత్రి పొంగులేటి


ఖమ్మం, 13 మార్చి (హి.స.)

రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల మూడు నెలలు గడిచిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలల్లో రోడ్లు, డ్రైయిన్లు ఇతర ఇతర మౌళిక వసతుల కల్పన పనులు ప్రాధాన్యతతో చేపట్టామని, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం చేపట్టిందన్నారు.

దమ్మాయిగూడెం గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్య రేపటి వరకు పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన రేషన్ కార్డులు జారీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా వంటి అనేక హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు మంజూరు చేస్తామని, రాబోయే మూడు సంవత్సరాలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని మంత్రి చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడెం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande