మూసీ అంశంలో విపక్షాలది రాజకీయం.. మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)మూసీ పునరుజ్జీవం విషయంలో విపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగ
మంత్రి పొన్నం


హైదరాబాద్, 13 మార్చి (హి.స.)మూసీ పునరుజ్జీవం విషయంలో విపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

'విపక్షాలకు అసలు ఏం కావాలో స్పష్టం చేయాలి. మీరు మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారా? నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారా? మీ తీరు చూస్తుంటే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే మీ ఎజెండాగా కనిపిస్తోంది' అని మంత్రి ధ్వజమెత్తారు. బాపూ ఘాట్ విషయంలో కొన్ని శక్తులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అందులో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన ఎజెండాను వివరించడానికి త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం, నగరాభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళన ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ తీరుపై స్పందిస్తూ.. 'బీజేపీకి తెలంగాణలో ఒక అజెండా, దేశవ్యాప్తంగా మరో అజెండా ఉంది. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను స్వాగతించే బీజేపీ, ఇక్కడ మాత్రం అడ్డుకోవడం విడ్డూరం' అని ఎద్దేవా చేశారు. అలాగే, గత పదేళ్లలో మూసీని విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు ఈ ప్రాజెక్టును విమర్శించే నైతిక హక్కే వారికి లేదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande