ఓ విద్యార్ది కి ఇచ్చిన మాట ప్రకారం రోడ్ నిర్మాణం చేపట్టి. మంత్రి లోకేష్మత నిలబెట్టు కు న్నారు
కారంపూడి13 మార్చి (హి.స.):ఓ విద్యార్థినికి ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టి.. మంత్రి లోకేశ్ మాట నిలబెట్టుకున్నారు. గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన అంగడి పావని చంద్రిక జిల్లా పర
ఓ విద్యార్ది కి ఇచ్చిన మాట ప్రకారం రోడ్ నిర్మాణం చేపట్టి. మంత్రి లోకేష్మత నిలబెట్టు కు న్నారు


కారంపూడి13 మార్చి (హి.స.):ఓ విద్యార్థినికి ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టి.. మంత్రి లోకేశ్ మాట నిలబెట్టుకున్నారు. గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన అంగడి పావని చంద్రిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి 600కి 598 మార్కులు తెచ్చుకుని రాష్ట్రంలోనే ప్రథమస్థానం సాధించింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమైన సందర్భంగా పావని చంద్రిక మాట్లాడుతూ.. తాము స్కూల్కు వెళ్లే ఎస్పేట రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ ఈ రహదారి నిర్మించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి చెప్పారు. ఈమేరకు రూ.18 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande