
ముంబై, 13 మార్చి (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్ ప్రారంభమైన కొ ద్దిసేపటికే సూచీలు భారీగా పతనం అయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 679 పాయింట్లు పతనమై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.
అదేవిధంగా నిఫ్టీ (NIFTY) కూడా 216 పాయింట్లు నష్టపోయి ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు డౌన్ ఫాల్ అవ్వడంతో దలాల్ స్ట్రీట్లో బేర్స్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఐటీ (IT), బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్ల పతనానికి కారణమైంది. అమెరికా మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ నిలకడ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..