
అమరావతి, 14 మార్చి (హి.స.)
,రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ ఆదేశాల మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా, మంత్రి నాదెండ్ల మనోహర్ జూమ్లో పాల్గొన్నారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ