.ఏపీలో గ్యాస్ సంక్షోభం. లేకండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోమ్ మంత్రి అనిత స్పష్టం
విశాఖపట్నం, 14 మార్చి (హి.స.) ,ఏపీలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత) స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత గురించి ఆందోళనలు తలెత్తుతుండటంతో రాష్ట్రంలో ఏవిధమైన సంక్షోభ
.ఏపీలో గ్యాస్ సంక్షోభం. లేకండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోమ్ మంత్రి అనిత స్పష్టం


విశాఖపట్నం, 14 మార్చి (హి.స.)

,ఏపీలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత) స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత గురించి ఆందోళనలు తలెత్తుతుండటంతో రాష్ట్రంలో ఏవిధమైన సంక్షోభం రాకుండా చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ ఆర్టీజీఎస్( ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు.

ఆర్టీజీఎస్ రాష్ట్రానికి గుండెలాంటిదిగా హోంమంత్రి పేర్కొన్నారు. అధికారులకు సీఎం చంద్రబాబు తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు. గ్యాస్ సరఫరా సాఫీగా సాగేలా చూస్తున్నట్లు హోంమంత్రి వివరించారు. దయచేసి వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు. గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande