
విశాఖపట్నం 14 మార్చి (హి.స.) పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామానికి చెందిన ఓ లేఔట్లో శుక్రవారం రాత్రి కొండచిలువలు కలకలం రేపాయి. ఇక్కడి లేఔట్లో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు వేసిన సిమెంట్ పైపుల్లోకి కొండచిలువలు వెళ్లడాన్ని గురువారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. స్నేక్ క్యాచర్స్ను పిలిపించి ఆ రోజు రాత్రే వాటిని పట్టించారు. పొక్లెయిన్తో చెట్లపొదలు, సిమెంట్ పైపులు తొలగించే క్రమంలో రెండు చనిపోయాయి. మిగిలిన నాలుగు కొండ చిలువలను శుక్రవారం ఉదయం యారాడ కొండల్లో విడిచిపెట్టినట్లు స్నేక్క్యాచర్ నాగరాజు తెలిపారు. ఇవి ఒక్కొక్కటి 12 అడుగుల పొడవు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ