
పర్చూరు:14 మార్చి (హి.స.) పిడుగురాళ్ల ఓడరేవు జాతీయ రహదారిలో పర్చూరు మండలం దేవరపల్లి గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందను శనివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో చీరాల నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. సుమారు 40 కి పైగా గొర్రెలు మృత్యువాత పడినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం సింగనపాలెం గ్రామం, తాళ్లూరు మండలానికి చెందిన రైతుల గొర్రెలుగా గుర్తింపు. గొర్రెలను ఢీకొన్న కారు పిడుగురాళ్ల- ఓడరేవు జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది. కారులోని వ్యక్తులు పరారైనట్లు సమాచారం. సమాచారా అందుకున్న వెంటనే పర్చూరు ఎస్సై పులి గోపి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చల్లా చెదురుగా పడి ఉన్న గొర్రెల కళేబరాలను, జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన కారును రోడ్డు పక్కకు తీయించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పర్చూరు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ