
హైదరాబాద్, 14 మార్చి (హి.స.)
దేశంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరత సహజమైనది కాదని, కొందరు కావాలనే 'కృత్రిమ కొరత'ను సృష్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachander Rao) ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారత్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ధరలు స్థిరంగా ఉన్నాయని రామచందర్ రావు గుర్తు చేశారు. గతంలో రూ. 1,200 ఉన్న గ్యాస్ ధరను కేంద్రం రూ. 900 కి తగ్గించి సామాన్యుడికి ఊరటనిచ్చిందని, విపక్షాలు కోసమే ప్రజలను కేవలం రాజకీయ లబ్ధి కోసమే భయపెడుతున్నాయని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవంపై ప్రశ్నల వర్షం.. మూసీ ప్రాజెక్టు (Musi project) విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రామచందర్ రావు పలు కీలక ప్రశ్నలు సంధించారు. మూసీ పునరుజ్జీవానికి మొదట రూ.5 వేల కోట్లు అన్న ప్రభుత్వం, ఇప్పుడు ఆ అంచనాలను నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి రూ.7 వేల కోట్లకు పెంచారంటూ ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. ప్రాజెక్టు ప్రారంభం అయ్యాక అంచనా బడ్జెట్ ఏ స్థాయికి వెళ్తుందోనని కామెంట్ చేశారు. మూసీ క్లీనింగ్కు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే అక్కడ నివసించే పేదలకు ప్రత్యామ్నాయం చూపించాకే పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ముందు మూసీలోకి వస్తున్న డ్రైనేజీ నీటిని ఎలా అడ్డుకుంటారో చెప్పాలన్నారు. సరైన డీపీఆర్ (DPR) ఉందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ 50 మీటర ఖసర్ బోన్ పేరిట
ప్రక్షాళనకు 50 మీటర్ల బఫర్ జోన్ పేరిట పేదలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని రామచందర్ రావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు