హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన
హైదరాబాద్, 14 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ''రీజినల్ రింగ్ రైల్'' (Regional Ring Rail) ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు డిపిఆర్ కు అవసరమైన సర్వేకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
Rail project


హైదరాబాద్, 14 మార్చి (హి.స.)

హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 'రీజినల్ రింగ్ రైల్' (Regional Ring Rail) ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు డిపిఆర్ కు అవసరమైన సర్వేకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ (Ravneet Singh) భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి (MP Chamala Kiran Kumar Reddy) తాజాగా లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటోదని చామల కిరణ్ కుమార్ రెడ్డి గతంలో అడిగిన ప్రశ్నకు బదులుగా తాజాగా కేంద్రం నుంచి ఈ లేఖ వచ్చింది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ అలైన్మెంట్ను రీజినల్ రింగ్ రోడ్ (RRR) వెంబడి ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలుకు కచ్చితమైన టైమ్ లైన్ ఇప్పుడే చెప్పలేమని అంతకంటే ముందు డీపీఆర్ సిద్ధం చేసేందుకు అవసరమైన సర్వేకు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, మరియు కేంద్ర ఆర్థిక శాఖల ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగు రైలు ప్రాజెక్టును ఆమోదించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవంగా రీజనల్ రింగు రైలు ప్రతిపాదిత మార్గం మొదట్లో రీజనల్ రింగు రోడ్డుకు సుమారు 10, 11 కిలోమీటర్ల దూరంలో ఉండేది. రెండు మార్గాలు సమాంతరంగా ఉన్నా, వాటి మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో రెండు చోట్లా భూసేకరణ, ఇతర సమస్యలు తలెత్తుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. సీఎం రేవంత్ ఈ అంశాన్ని కేంద్రానికి వివరించారు. ఈ క్రమంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande