కేంద్రమంత్రితో సీతక్క భేటీ.. క్రెచ్ వర్కర్ల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి
తెలంగాణ మంత్రి సీతక్క శనివారం కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిశారు
Seethaakka


హైదరాబాద్, 14 మార్చి (హి.స.)తెలంగాణ మంత్రి సీతక్క శనివారం కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు.. మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు డీపీఆర్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పాలనా’ పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. వారు చేస్తున్న పనికి ఇది ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande