
హైదరాబాద్, 14 మార్చి (హి.స.)వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. తితిదే అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే వాహనాల రద్దీని నియంత్రిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్