సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు: నటి అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
నటి అనసూయపై అసభ్యకర AI వీడియోలు, పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
/indecent-posts-on-social-media-accused-arrested-after-complaint-by-actr


అమరావతి, 14 మార్చి (హి.స.)సోషల్ మీడియా వేదికగా లేడీ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నాడు. ఇతడు నటి అనసూయను ఉద్దేశించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అసభ్యకర వీడియోలను రూపొందించి, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు. దీనిపై అనసూయ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande