రాష్ట్రంలో.గడిచిన వారం రోజులుగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది
అమరావతి, 15 మార్చి (హి.స.)రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా విద్యుత్తు వినియోగం భా రీగా పెరిగింది. గత ఏడాది మండువేసవిలో ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చి నెల 7న 274.6 మిలియన్ యూనిట్ల వినియోగం నమో
రాష్ట్రంలో.గడిచిన వారం రోజులుగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది


అమరావతి, 15 మార్చి (హి.స.)రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా విద్యుత్తు వినియోగం భా రీగా పెరిగింది. గత ఏడాది మండువేసవిలో ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చి నెల 7న 274.6 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. ఆ తర్వాత కూడా సగటు వినియోగం 270 మిలియన్ యూనిట్లుగా నమోదవుతూ వస్తోంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లోనూ వరుసగా 272 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. గత ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు గరిష్ఠ విద్యుత్తు వినియో గం 248.88 మిలియన్ యూనిట్లు మార తమే. గతేడా ది ఇదే సమయానికి వినియోగించిన విద్యుత్తు కంటే ఈ సారి 9.15 శాతం ఎక్కువగా వాడుతున్నారు.

వారం రోజులుగా అకస్మాత్తుగా విద్యుత్తు వినియోగం భారీగా పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం. మరొకటి పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. మార్చి మొదటి రోజు నుంచే 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో ఉక్కపోత కూడా పెరిగింది. ఈ కారణంగా సహజంగానే విద్యుత్తు వినియోగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా వంట గ్యాస్ లభ్యత తగ్గుతుందనే ఆందోళనతో చాలా మంది గా ్యస్ను పొదుపుగా వాడుకుంటున్నారు. ఇండక్షన్ స్ట్టవ్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వినియోగం గణనీయంగా పెరిగిందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే.. ఉదయం 8 గంటల నుం చి 10 గంటలలోపు విద్యుత్తు వినియోగం గతంలో కన్నా ఎక్కువ నమోదవుతోందని వివరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande