
కర్నూలు, 15 మార్చి (హి.స.) : ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని నగరానికి చెందిన శ్రీకర్రాజ్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 806వ ర్యాంకు సాధించి విజయప్రస్థానాన్ని ‘sపంచుకున్నారు.
‘‘ కర్నూలు నా స్వస్థలం. నా తల్లి భాగ్యలక్షి గృహిణి. నా తండ్రి డాక్టర్ కె.రాజశేఖర్ నగరంలో సీఎన్ ఆసుపత్రి స్థాపించి వైద్యరంగంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ నాకు మాత్రం ఇంజినీరింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం. నా నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్లాలని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను ఇంటర్ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి భువనేశ్వర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలో సీటు సంపాదించా. ఇంజినీరింగ్కు మేనేజ్మెంట్ నైపుణ్యాలు కూడా ఉంటే మరిన్ని అవకాశాలొస్తాయన్న ఉద్దేశంతో తిరుచ్చి ఐఐఎం నుంచి ఎంబీఏ కూడా పూర్తిచేశా. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థల్లో సీటు రావడంతో ఎంబీఏ పూర్తైన వెంటనే భారీ వేతనంతో ఓ కార్పొరేట్ బ్యాంకులో చేరా. ఆ ఉద్యోగం నాకు అంత సంతృప్తినివ్వలేదు. అదే సమయంలో సమాజంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా నా దృష్టికి వచ్చాయి. అలాంటివారికి అవసరమైన సేవ చేయాలంటే ఐఏఎస్లకు అవకాశం దొరుకుతుందని భావించాను. అనుకున్నదే తడవుగా నా ఉద్యోగానికి రాజీనామా చేశా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ