క్యాబేజీ లోడు మాటున తరలింపు.. ఏపీలో 650 కిలోల గంజాయి పట్టివేత..!
విజయనగరం, 15 మార్చి (హి.స.) విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో నార్కోటిక్ కంట్రోల్ టీమ్ జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 650 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్ల
cabbage-load-being-smuggled-650-kg-of-marijuana-seized-in


విజయనగరం, 15 మార్చి (హి.స.)

విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో నార్కోటిక్ కంట్రోల్ టీమ్ జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 650 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఒడిశా నుంచి ఒక వాహనంలో క్యాబేజీ లోడ్ మాటున గంజాయిని తరలిస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ టీమ్కు ముందస్తు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన అధికారులు బొండపల్లి వద్ద సదరు వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేయగా, క్యాబేజీ బస్తాల కింద దాచిన గంజాయి నిల్వలు బయటపడ్డాయి. అధికారులు గంజాయితో పాటు వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర నెట్వర్క్ గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande