
ద్వారకాతిరుమల15 మార్చి (హి.స.)
, : గ్యాస్ కొరత కారణంగా ద్వారకా తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం విభాగంలో శనివారం కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేశామని, అవసరం మేరకు స్వామివారి నివేదనశాలలో, ప్రసాదాల తయారీ విభాగంలో, ఉచిత ప్రసాదాలు తయారుచేయడానికి మరికొన్ని ఏర్పాటు చేస్తామని ఈవో వై.భద్రాజీ తెలిపారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆలయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ను కోరామన్నారు.
ద్వారకా తిరుమల ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా భీమడోలు, వయా తడికలపూడి, వయా దెందులూరు - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు. పెద్దతిరుపతి (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ