బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావు
హైదరాబాద్, 15 మార్చి (హి.స.) ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా
హరీష్ రావు


హైదరాబాద్, 15 మార్చి (హి.స.)

ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారని, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు.

బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande